Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితా ప్రకారం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డి కె శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.

Karnataka Assembly Elections:త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితా ప్రకారం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డి కె శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. పార్టీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ ఆయన కుమారుడు వైద్యుడు యతీంద్ర సిద్ధరామయ్య 2018 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు.
కర్ణాటక పై కాంగ్రెస్ గురి..(Karnataka Assembly Elections)
సిద్ధరామయ్య కు మొదటినుంచి పట్టువున్న కోలార్ మరియు ఆయన ప్రస్తుత సీటు బాదామికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కోలార్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సిద్ధరామయ్య అక్కడనుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మే నాటికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీలో కనీసం 150 సీట్లు సాధించి, స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాదిలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కేహెచ్ మునియప్ప బెంగళూరు రూరల్‌లోని దేవనహళ్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర కొరటగెరె (ఎస్‌సి) నియోజకవర్గం నుండి, ప్రియాంక్ ఖర్గే చితాపూర్ (ఎస్‌సి) నుండి పోటీ చేయనున్నారు. ప్రియాంక్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు.మరో మూడు నాలుగు రోజుల్లో రెండో జాబితాను విడుదల చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. కేంద్ర ఎంపిక సంఘం మరియు స్క్రీనింగ్ సంఘం క్లియర్ చేసిన అన్ని పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లియర్ చేసింది. మరో మూడు, నాలుగు రోజుల్లో రెండో జాబితాను కూడా ఖరారు చేస్తామని డీకే శివకుమార్ బెంగళూరులో విలేకరులతో అన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగిసే సమయానికి మే నెలలోపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు..
కర్నాటక మే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది, ముస్లింలకు ఓబీసీ కోటా కింద నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలైన లింగాయత్‌లు మరియు వొక్కలిగాలకు ఒక్కొక్కరికి రెండు శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీనితో ప్రస్తుతం
నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్న వొక్కలిగకు ఇప్పుడు ఆరు శాతం, ఐదు శాతం రిజర్వేషన్లు పొందుతున్న లింగాయత్‌లకు ఇప్పుడు ఏడు శాతం లభించనుంది
ముస్లింలు ఇప్పుడు 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్ కేటగిరీ కింద వసతి కల్పిస్తారు.
ఇవి కూడా చదవండి:
- PM Modi In Varanasi: వారణాసిలో 28 ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Vande Bharat train: గోవిందుడి చెంతకు‘వందేభారత్’.. ఏప్రిల్ 8న ప్రారంభం?