Encounter in Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం!

Encounter at Chattisgarh – Maharastra Border: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంట్ జరిగింది. మహారాష్ట్ర సరిహాద్దులో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం. కాల్పుల్లో దాదాపు 20 మంది మావోలు హతమైనట్టు తెలుస్తోంది. కాగా నక్సల్స్ శిబిరాలపై పోలీసులు, సీ- 60 కమాండోలు మెరుపు దాడి చేశారు. మూడు స్థావరాల్లో ఎదురు కాల్పులు జరిగినట్టు సమాచారం. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మరోవైపు మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో ఇన్ఫార్మర్ల నెపంతో నలుగురిని కాల్చి చంపారు. మృతులది లింగాల, కంచాల, మినగట్టు గ్రామవాసులుగా గుర్తించారు. కాగా కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భారీగా మావోయిస్టులు హతమయ్యారు. అయితే పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారనే వంకతో నలుగురిని హత్య చేసినట్టు తెలుస్తోంది. కాగా భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను నిలిపివేసింది.