Published On:

Fire Accident in Vijayawada: విజయవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Fire Accident in Vijayawada: విజయవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

3 Killed in Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని ముత్యాలమ్మగా గుర్తించారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.