Published On:

Encounter : కర్రెగుట్టలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి

Encounter : కర్రెగుట్టలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి

28 Maoists killed in Encounter : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల జరిగిన కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టలో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో 5 రోజులుగా కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మావోల కీలక నేతలు హిడ్మా, దేవా లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్‌లో భాగంగా 3 రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా బలగాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోలు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

 

జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు..
కర్రెగుట్టలో సుమారు 1000 మంది మావోలు ఉన్నట్లు సమాచారం. దీంతో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. గుట్ట సమీపంలోని ప్రజలు బయటకు రావొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించారు. మావోయిస్టుల కోసం డ్రోన్ల సాయంతో ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజననులు భయాందోళనలకు గురవుతున్నారు. భద్రతా సిబ్బందికి ఎనిమిది హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, భోజనాలు, మంచినీటిని సరఫరా చేస్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి: