Published On:

UK: పీఓకేలో ఉగ్రవాదులను తుడిచిపెట్టండి: బ్రిటన్ ఎంపీ

UK: పీఓకేలో ఉగ్రవాదులను తుడిచిపెట్టండి: బ్రిటన్ ఎంపీ

UK: పహల్గాం ఉగ్రవాడికి వ్యతిరేకంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ ను కొనియాడారు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ ( UK MP Bob Blackman). ఉగ్రవాదులపై చేసిన దాడి అద్భుతమన్నారు. పీఓకేలోని ఉగ్రస్థావరాలను మరింత నేలమట్టం చేయాలని వారి ఉనికి ప్రపంచానికి ప్రమాదకరమన్నారు. యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు.

 

“పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నాం. ఇందుకు ప్రతిగా భారత్ భీకరమైన ఆపరేషన్ సింధూర్ ను చేసింది. పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడి చేసింది. అందులో సామాన్య పౌరులు, మిలటరి బేస్ లపై దాడులు చేయకపోవడం అభినందనీయం. ప్రస్తుతం ఇరు దేశాలల మధ్య శాంతి నెలకింది. అయితే పాకిస్తాన్ లోని అన్ని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయాలి” అని బాబ్ ప్రసంగించారు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని ఆయన ప్రశ్నించారు. ఇందుకు యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి భయంకరమైనదని, ఉగ్రవాదంపై పోరుకు భారత్, పాకిస్తాన్ తో కలిసి బ్రిటన్ పనిచేస్తదని అన్నారు.

 

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు నేపాల్ కు చెందినవారు ఉన్నారు. మతమే ప్రతిపాదికగా సాగిన మారణకాండ అత్యంత ధారుణమైనది. ఇందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. దీంతో ఉగ్రవాదుల తొమ్మిది స్థావరాలు నాశనమయ్యాయి. ఉగ్రవాదులపై దాడులు చేయగా అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. పాక్ డ్రోన్లు, మిసైల్లు ఒక్కటి కూడా భారత్ భూభాగాన్ని తాకలేకపోయాయి.

 

భారత్ డిఫెన్స్ సిస్టమ్ ముందు పాక్ విలవిలబోయింది. అందుకు అక్కసుగా సామాన్య ప్రజల ఇల్లపై దాడులు చేసింది పాక్. జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాలపై దాడులకు పాల్పడింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత్ పాకిస్తాన్ లోని పలు ఎయిర్ బేస్ లపై దాడులు చేసింది. దీంతో కాళ్లభేరానికి వచ్చింది. ట్రంప్ శరణుజొచ్చగా, భారత్ కొంతకాలనికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ ను హోల్డ్ చేసింది.