Operation Karre Gutta: కర్రెగుట్టల్లో భారీ సొరంగం

Operation Karre Gutta: చత్తీస్ ఘడ్ – తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులే లక్ష్యంగా వేలాదిగా ముందుకు కదులుతున్నారు. ఈక్రమంలో భారీ సొరంగాన్ని గుర్తించాయి బలగాలు. ఇందులో సునాయాసంగా వెయ్యిమంది తలదాచుకోవచ్చు. ఇందులో అన్ని వసతులు ఉన్నాయి. తాగునీటికి బయలకు పోకుండా అందులోనే ఏర్పాటుచేసుకున్నారు మావోయిస్టులు. కొన్ని నెలల పాటు ఇందులోనే నివసించినట్లు తెలుస్తోంది.
నిరంతరాయంగా కొనసాగుతోన్న కూంబింగ్ కారణంగా మావోయిస్టులు డీహైడ్రేషన్ కు గురయ్యారని, వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఆహారం కోసం అలమటిస్తున్నట్లుగా సమాచారముందన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు అన్ని కొండలను చుట్టుముడుతున్నాయి.
90కిలో మీటర్ల పొడవున కర్రెగుట్టలు భద్రతా బలగాల ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ములగు వెంకటాపురం సరిహద్దుగా చత్తీస్ గఢ్ లోని దాదాపు 10 ప్రాంతాలలో ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టలను తమ ఆదీనంలోకి తెచ్చుకోవడానికి బలగాలు శ్రమిస్తున్నాయి. శనివారం సాయంత్రం వరకు కూంబింగ్ నిర్వహించగా భారీ సొరంగాన్ని కనుగొన్నారు.