Last Updated:

Hyderabad News : హైదరాబాద్ నగర వాసులకు గమనిక.. రెండు రోజులపాటు ఆ ఏరియాల్లో మంచి నీళ్ళు బంద్

హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వ అధికారులు ముఖ్య గమనిక చేస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు నగర పరిధిలోని పలు ఏరియాల్లో మంచి నీటి సరఫరాకి నాథరాయం కలుగుతుందని కావున ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను రిలీజ్ చేశారు. కాగా ఇంతకీ విషయం ఏంటంటే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మిస్తున్నారు.

Hyderabad News : హైదరాబాద్ నగర వాసులకు గమనిక.. రెండు రోజులపాటు ఆ ఏరియాల్లో మంచి నీళ్ళు బంద్

Hyderabad News : హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వ అధికారులు ముఖ్య గమనిక చేస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు నగర పరిధిలోని పలు ఏరియాల్లో మంచి నీటి సరఫరాకి నాథరాయం కలుగుతుందని కావున ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను రిలీజ్ చేశారు. కాగా ఇంతకీ విషయం ఏంటంటే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మిస్తున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్ కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపు లైన్ కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఈ పైప్‌ లైన్‌ పనుల నేపథ్యంలో నగరంలో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి.. మార్చి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు పనులు నిర్వహించనున్నారు. 48 గంటల పాటు జరగనున్న ఈ పనులను దృష్టిలో ఉంచుకొని.. రెండు రోజుల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. దీంతో నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాలలో ప్రజలు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

పాక్షికంగా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

డివిజన్ నం. 6 (ఎస్. ఆర్. నగర్) : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.

డివిజన్ నం. 9 (కూకట్ పల్లి) : కేపీహెచ్ బీ, మల్యాసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు.

డివిజన్ నం. 15 (శేరిలింగం పల్లి) : లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు.

డివిజన్ నం. 23 ( నిజాంపేట్) : ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుపల్లి.

పూర్తిగా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు (Hyderabad News)..

డివిజన్ నం.12 (కుత్బుల్లాపూర్) : షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం.

డివిజన్ నం.13 (మల్కాజ్ గిరి/అల్వాల్) : డిఫెన్స్ కాలనీ.

డివిజన్ నం. 19 : నాగారం/ దమ్మాయి గూడ, కీసర.

డివిజన్ నం. 24 (బొల్లారం) : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ సప్లై.

డివిజన్ నం. 25 (కొంపల్లి) : కొంపల్లి, గొండ్ల పోచంపల్లి ప్రాంతాలు. ఆర్ డబ్య్లూఎస్ ఆఫ్ టేక్ ప్రాంతాలు : కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు.

డివిజన్ నం. 14 (ఉప్పల్) : కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు.

కావున ప్రజలు సహకరించి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మనవి..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/