Telangana: ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే అకౌంట్లోకి రూ.1,00,000 నగదు జమ

Indiramma Housing Scheme Deposit the First Installment: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేసింది. తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా.. దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. అయితే ఈ పది రోజుల్లో ఎక్కువమంది లబ్దిదారులు ప్రారంభించనున్నారు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఒకవేళ బేస్ మెంట్ పూర్తయిన సమక్షంలో లబ్ధిదారుల ఖాతాల్లో మార్చి 15వ తేదీలోగా రూ.లక్ష చొప్పున నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం రూ.715 కోట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొత్తం దశలవారీగా రూ.5లక్షలు అందించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.