CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త కలర్‌లో ఆ రోజు నుంచే!

CM Revanth Reddy Announcement about new ration cards: ఉగాది పండుగ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని ఆదేశించారు. కార్డుపై సీఎం, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. వీరందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఇప్పటికే ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ప్ర జలంతా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మీ సేవలను క్యూ కడుతున్నారు.
అయితే, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పని సరి కావడంతో వీటి కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. ఆ సర్వేలో సైతం కుటుంబ సభ్యుల ఆదాయం, ఇతర వనరులకు సంబంధించి కీలక సమాచారాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజల ఆదాయంపై ప్రభుత్వా నికి ఓ నిర్దిష్టమైన సమాచారం ఉంది. దీంతో పాటు దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 30వ తేదీన ఉగాది రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.