Last Updated:

KTR: నష్టాలు జాతికి.. లాభాలు దోస్తులకు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

KTR: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దశంతో నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు.

KTR: నష్టాలు జాతికి.. లాభాలు దోస్తులకు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

KTR: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దశంతో నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను అదానీకి పంచడమే మోదీ లక్ష్యమని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిలా గనులను కాపాడటం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

నష్టాలు జాతికి.. లాభాలు అదానీకి (KTR)

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దశంతో నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను అదానీకి పంచడమే మోదీ లక్ష్యమని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిలా గనులను కాపాడటం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కావాలనే.. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. ప్రభుత్వ సంస్థలు స్థిరంగా ఉంటేనే.. ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బండి సంజయ్ విషయ పరిజ్ఞానం లేదని.. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదని అన్నారు.

బయ్యారం ప్లాంట్ విషయంలో ఇదివరకే ప్రధానిని కలసిని ప్రయోజనం లేదని కేటీఆర్ అన్నారు. కేంద్ర పెద్దలు కావాలనే బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు, నిధులు. ఇవ్వకపోవడంతోనే నష్టాలు వచ్చాయన్నారు. విశాఖ పొట్ట కొడుతున్నది ప్రధాని మోదీనే. బయ్యారం విషయంలో కూడా అదే జరుగుతుంది.

నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి. తెలుగు రాష్ట్రాలకు విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోంది అని కేటీఆర్‌ విమర్శించారు.

 

బయ్యారానికి వీలుకాదని చెప్పి.. ముంద్రాకు..

బైలదిలా గనులపై అదానీ, కేంద్రంలోని పెద్దల కన్ను పడిందన్నారు కేటీఆర్.

160 కి.మీ. దూరంలో ఉన్న బయ్యారానికి కాకుండా.. 1800 కి.మీ. దూరంలో ఉన్న ముంద్రాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మోదీ కేవలం తన ఇష్టరత్నాలకు మాత్రమే.. ప్రభుత్వరంగంలోని సంస్థలను కట్టబెడుతున్నారు.

లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లోకి నెట్టి.. వాటిని అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

బైలదిలా గనులు బయ్యారం, విశాఖకు సమీపంలో ఉన్నాయి. బైలదిలా 1.34 బిలియన్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ లభించే గనులు.

ఆ గనులు అదానీ చేతుల్లోకి వెళ్తే విశాఖ ఉక్కుకు, తెలంగాణకు నష్టమని కేటీఆర్ అన్నారు.