Last Updated:

TREIRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు

TREIRB: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 9,231 పోస్టులు ఉన్నాయి.

TREIRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు

TREIRB: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 9,231 పోస్టులు ఉన్నాయి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 9,231 పోస్టులు ఉన్నాయి. మొత్తం 9,231 పోస్టులకు గాను.. 9 నోటిఫికేషన్లను విడివిడిగా బోర్డు విడుదల చేసింది.

ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులంటే.. (TREIRB)

డిగ్రీ కళాశాలల్లో 868 అధ్యాపక, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

జూనియర్‌ కళాశాలల్లో 2,008 లెక్చరర్లు, పాఠశాలల్లో ,1276 పీజీటీ, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ నెల 12 నుంచి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ తెలిపారు.

వివిధ సంక్షేమ పాఠశాలల్లో.. వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో వయో పరిమితి.. విద్యార్హత, ఇతర వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ పోస్టులు 4,020 ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మే 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వేతన స్కేలు రూ.42,300 నుంచి రూ.1,15,270వరకు ఉండనుంది.

డిగ్రీ కళాశాలల్లో మొత్తం 868 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వేతనం రూ.54,220 నుంచి రూ.1,33,630లుగా ఉంటుంది.

అలాగే జూనియర్ కళాశాలల్లో 2008 పోస్టులు ఉన్నాయి. వేతనం రూ. 54.220 నుంచి 1.33.630లుగా ఉంటుంది.

పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ ఉద్యోగాల్లో మొత్తం 1,276 పోస్టులకు ఏప్రిల్‌ 24 నుంచి మే 24వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు.

ఇందులో పోస్టులకు వేతనం రూ.45,960 నుంచి రూ.1,24,150గా ఉంటుందని పేర్కొన్నారు.