Hyderabad Police: సిటీ రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ
మహా నగరం హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు..ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి.
Hyderabad Police: మహా నగరం హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు..ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అయితే ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు, రష్ ను తగ్గించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సైకిల్ రిక్షాలు, తోపుడు బండ్లు, ఎద్దుల బండ్లు, వ్యవసాయ పనుల్లో వినియోగించే యంత్రాలు, ట్రాక్టర్లు లాంటి నెమ్మదిగా కదిలే వాహనాలతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని.. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
దీంతో ఆయా వాహనాల రాకపోకలపై కమిషనర్ నిషేధం విధించారు. వీటితో పాటు లోకల్ లారీలు, గూడ్స్ వంటి భారీ వాణిజ్య వాహనాలు, అంతర్రాష్ట్ర వాహనాలు, నేషనల్ పర్మిట్ లారీలు, ప్రైవేట్ బస్సులపై పలు ఆంక్షలు విధించారు. ఇకపనై పోలీసులు సూచించిన సమయం ప్రకారం ఆయా వాహనాలు సిటీలోకి ప్రయాణాలు కొసాగించాల్సి ఉంటుంది.
ఏ వాహనాలు.. ఎప్పుడంటే(Hyderabad Police)
10 టన్నుల కంటే ఎక్కువ బరువు వస్తువులను సరఫరా చేసే వాణిజ్య వాహనాలకు నగరంలోని పలు ప్రాంతాలలో ఉదయం, రాత్రి సమయాల్లో రాకపోకలకు అనుమతి లేదు.
ఇక ప్రైవేట్ బస్సులు జంట నగరాలలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నడపడానికి అనుమతి లేదు.
నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రిని మోసుకెళ్లే వాహనాలు, లోకల్ లారీలకు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య అనుమతి ఉంటుంది.
3.5 టన్నుల నుంచి 12 టన్నుల లోపు బరువు వస్తువులను సరఫరా చేసే వాహనాలకు.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..
తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే అనుమతి ఉంటుంది.