Last Updated:

Uttar Pradesh: పోలీసులు, మీడియా చూస్తుండగానే గ్యాంగ్ స్టర్ అతీక్ సోదరుల కాల్చివేత

ప్రయోగ్ రాజ్ లో జరిగిన అతీక్ సోదరులు కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

Uttar Pradesh: పోలీసులు, మీడియా చూస్తుండగానే గ్యాంగ్ స్టర్ అతీక్ సోదరుల కాల్చివేత

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుబు అష్రాఫ్ లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి కాల్చి చంపారు. చుట్టూ పోలీసుులు, ఎదురుగా మీడియా ప్రశ్నలు కొనసాగుతుండగా.. చుట్టూ అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వేగంగా వచ్చి కాల్పులు జరిపారు. ప్రయాగ్ రాజ్ లోని ఓ మెడికల్ కాలేజ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం అతీక్, అష్రాఫ్ లను తీసుకెళ్తుండగా మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ సమయంలోనే మీడియా ప్రతినిధుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. అతి దగ్గరి నుంచి వారిని తుపాకులతో కాల్చారు.

మొదట అతీక్ నుదుటిపై కాల్చగా..అతడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే పలుమార్లు కాల్పులు జరిపగా.. ఇద్దరి శరీరాలు బుల్లెట్స్ తో తూట్లు పడ్డాయి. ఈ దృశ్యాలన్నీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు .. కాల్పులు జరిపిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో పోలీసులకూ గాయాలయ్యాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపల ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

అతీక్ కోరిక నెరవేరకుండానే..(Uttar Pradesh)

అతీక్ పుట్టి పెరిగి.. నేర సామ్రాజ్యానికి కీ పాయింట్ గా చేసుకున్న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోనే కాల్పుల్లో మరణించారు. అతీక్ మూడో కుమారుడు అసద్ ను యూపీ పోలీసులు ఝూన్సీలో గురువారం ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతడి అంత్యక్రియలు శనివారం ఉదయం ప్రయాగ్ రాజ్ పూర్తి అయ్యాయి. అయితే వాటిలో పాల్గొనాలని అతీక్ కోరగా అనుమతి లభించలేదు. దీంతో అతీక్ కోరిక తీరకుండానే.. అదే రోజు రాత్రి కల్లా సోదరుడితో సహా తాను మృతి చెందాడు. కాగా, ఇపుడు ఈ జంట హత్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం యోగి నేతృత్వంలో జరుగుతున్న ఎన్ కౌంటర్ లకు కొనసాగింపు అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

Bodies of Gangster-turned-politician Atiq Ahmed and his brother Ashraf ...

 

100 పైగా క్రిమినల్ కేసులు

గ్యాంగ్ స్టర్ గా పేరు మోసిన అతీక్ పై దాదాపు 100 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005 లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య సంబంధించి ప్రధాన సాక్షి ఉమేశ్ పాల్ ను హత్య చేసిన కేసులో అతీక్ నిందితులు. ఈ క్రమంలో విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవల అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్ రాజ్ కు తీసుకొచ్చారు. అసద్ అంత్యక్రియలు జరిగిప ప్రాంతానికి కేవలం 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అతీక్ సోదరులను శనివారంతా విచారించారు. అనంతరం మెడికల్ టెస్టుల కోసం రాత్రి 10 గంటల సమయంలో ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి నుంచి వెళ్లే క్రమంలో మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించింది. కుమారుడి అంత్యక్రియలు హాజరు కాలేకపోయారు అని మీడియా ప్రశ్నించగా.. పోలీసులు అనుమతించలేదని అతీక్ సమాధానమిచ్చారు. అసలు విషయం ఏంటంటే.. అని అతీక్ చెబుతుండగానే క్షణకాలంలో కాల్పులు జరిగాయి. మీడియా ప్రతినిధులుగా అక్కడే ఉన్న వారు పిస్లళ్లు తీసి కాల్పులు జరిపారు. దీంతో సోదరులిద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిందితులు ఇద్దరు స్వయంగా పోలీసులు లొంగిపోయారు. మూడో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య నేపథ్యంలో మెడికల్ కాలేజ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

 

నిందితుల అరెస్టు.. యూపీ లో 144 సెక్షన్(Uttar Pradesh)

హంతకులను లవ్లేశ్ తివారీ, అరుణ్ మౌర్య, సన్నీగా పోలీసులు గుర్తించారు. వారు ఉపయోగించిన పిస్టళ్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మాన్ సింగ్ అనే కాని స్టేబుల్ , ఓ మీడియా ప్రతినిధి స్వల్పంగా గాయపడినట్టు తెలిసింది. అతీక్ సోదరుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రయోగ్ రాజ్ లో జరిగిన అతీక్ సోదరులు కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రయాగ్ రాజ్ లో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ ఘటనపై 17 మంది పోలీసులను సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల ఘటనపై త్రిసభ్య జ్యుడీషియల్ కమిషన్ వేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.