Last Updated:

Telangana Assembly: కొలువుదీరిన తెలంగాణ మూడో శాసనసభ

తెలంగాణ మూడో శాసనసభ కొలువుదీరింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.

Telangana Assembly: కొలువుదీరిన తెలంగాణ మూడో శాసనసభ

Telangana Assembly:తెలంగాణ మూడో శాసనసభ కొలువుదీరింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.

బీజేపీ బాయ్‌కాట్..(Telangana Assembly)

మజ్లిస్ సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంతో శాసన సభలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్ చేశారు. బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన మద్దతుకోసమే అక్బరుద్దీన్‌ని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసిందని టిబిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయాలన్న సాంప్రదాయాన్ని కాంగ్రెస్​ప్రభుత్వం తుంగలో తొక్కిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. రెగ్యులర్​ స్పీకర్​ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనందున ఇంకా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు.

తన తండ్రి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇవాళ బిఆర్ఎస్‌ శాసన సభాపక్ష సమావేశానికి హాజరు కాలేకపోయానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కెటిఆర్ సందేశాన్ని పోస్ట్ చేశారు. శాసన సభ సమావేశాలకి కూడా ఈ కారణంగానే హాజరు కాలేదని కెటిఆర్ తెలిపారు. తనతోపాటు ఇవాళ హాజరు కాని మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలం శాసన సభ కార్యదర్శికి సమాచారం ఇచ్చామని కెటిఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి మరో తేదీని నిర్ణయించాలని శాసన సభ కార్యదర్శిని కోరామని కేటీఆర్ అన్నారు.