Last Updated:

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్.. సీఎం కీలక నిర్ణయం

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్.. సీఎం కీలక నిర్ణయం

CM Revanth Reddy Comments about Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌తో పాటు బెట్టింగ్ యాప్స్, అన్‌లైన్ రెమినీకి సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగడం, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడారు. అయితే, గత ప్రభుత్వం 2017లోనే ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం చేశారే కానీ అమలులో నిర్లక్ష్యం వహించారన్నారు. ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోందన్నారు.

 

ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ నేరం అంతర్జాతీయ స్థాయిలో వివిధ రకాల సంస్థలు, రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో నేరగాలు ఉన్నారని చెప్పారు. ఈ డిజిటల్ గేమింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ యాప్స్, ఆన్‌లైన్ రమ్మీ తదితర వాటిని నిరోధించడంతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేదా సీబీసీఐడీ లేదా అధికారులతో సమీక్ష నిర్వహించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

 

గత ప్రభుత్వం చేసిన చట్టంలో రెండేళ్లకు మించి శిక్ష లేదన్నారు. అందుకే రానున్న సమావేశాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులతో పాటు ఆడే వారికి బాధితులను శిక్ష పెంచేలా చట్టాలను సవరించాల్సిన అవసరం లేదన్నారు. గుట్కా, నిషేధిత పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా ప్రత్యేక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అందుకే ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధం కోసం సిట్ వేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.

 

రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావని, ఎన్నికలు 2029లో వస్తాయని కొంతమంది అనుకున్నంత మాత్రాన ముందే రావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలాంటి విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమతో చేరినా ఎలాంటి సమస్య ఉండదన్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఇద్దరు దుష్ప్రచారం చేసేందుకు పోటీపడుతున్నారని, ఆ ఇద్దరి కారణంగా తలనొప్పి మొదలైందన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.