CM Revanth Reddy: సీఎంగా నేను తలచుకుంటే.. కేటీఆర్, కేసీఆర్ కుటుంబమంతా చర్లపల్లి జైలుకే!

CM Revanth Reddy Full Speech in Assembly: లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు వాడీవేడిగా జరిగాయి. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. బల్లులు, పురుగులు తిరిగే రూంలో ట్యూబులైట్లు వేసేలా చేశారని, దీంతో 16 రోజులు నిద్రపోలేదని చెప్పారు. ఉదయం చెట్టు కింద నిద్ర పోయేవాడినని, అయినా నేను ఏనాడూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు.
నా కూతురు లగ్నపత్రికకు కూడా రాసుకోవడానికి కూడా గత ప్రభుత్వం అడ్డుకుందన్నారు. డ్రోన్ ఎగరేస్తే మామూలుగా రూ. 500 జరిమానా వేస్తారని, ఎవరో డ్రోన్ ఎగురవేస్తే ఆ విషయాలను మీడియాకు పంపిస్తే జైలులో పెట్టి వేధించారన్నారు. మేం ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని, మేం అలా చేస్తే వాళ్లు అక్కడ కూర్చుని మాట్లాడేవారు కాదన్నారు.
నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారని, వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నేను నెరవేర్చలేదన్నారు. సీఎంగా అధికారం వినియోగించి ఉంటే వాళ్లంతా జైలుకు వెళ్లేవారన్నారు. కిరాయి మనుషులతో తిట్టిస్తున్నా.. నేను సంయమనం పాటిస్తున్నట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్ కంటే ఎక్కువ మొత్తం ఇస్తూ రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని రైతులను బెదిరించారని, కానీ వారి ఫామ్ హౌస్‌లో మాత్రం వరి పండించి అమ్ముకున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.16,900 కోట్లతో రుణమాఫీ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.20, 615 కోట్లతో రైతు రుణమాఫీ చేశామన్నారు. పదేళ్లలో చేసిన దానికంటే మేం పది నెలల్లో ఎక్కువ చేశామన్నారు. ఎన్నికల సమయంలో వాళ్లు ఎగ్గొట్టిన రైతు బంధు కూడా మేమే ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను 10 నెలల్లో చేస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు.