Last Updated:

CM Jagan Comments: పొటాటో ను ఉల్లిగడ్డే అంటారుగా.. అధికారులను అడిగిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం, బాలిరెడ్డి పల్లి లో వరద బాధితులతో జగన్ మాట్లాడారు.ప్రభుత్వం అందించే రేషన్ వివరాలు వెల్లడిస్తూ కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు.

CM Jagan Comments: పొటాటో ను  ఉల్లిగడ్డే అంటారుగా.. అధికారులను అడిగిన సీఎం జగన్

CM Jagan Comments: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం, బాలిరెడ్డి పల్లి లో వరద బాధితులతో జగన్ మాట్లాడారు.ప్రభుత్వం అందించే రేషన్ వివరాలు వెల్లడిస్తూ కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు.

ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా..(CM Jagan Comments)

ఈ సందర్బంగా పొటాటోని ఉల్లిగడ్డే అంటారుగా అంటూ అధికారులను సీఎం ప్రశ్నించారు. సీఎంకు ఏమంటారో తెలియకపోవడంతో బంగాళదుంప అంటారంటూ అక్కడికి వచ్చిన జనం చెప్పారు. చివరకు అధికారులను పోటాటోను ఏమంటారు అని అడగడం చర్చనీయాంశం అయింది. చివరికి బంగాళదుంప… అంటూ పొడిపొడిగా జగన్ చెప్పారు. దీంతో ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి. ఇదే కాదు గతంలో చాల సార్లు జగన్ మాటల్లో ,ప్రసంగాల్లో తప్పిదాలే జరిగాయి. అందుకే ప్రతిపక్ష పార్టీలు నిత్యం జగన్ తెలుగు భాష పై సెటైర్లు వేస్తుంటారు.

విద్యానగర్‌ హెలిప్యాడ్‌ నుంచి బాలిరెడ్డి పాలెం వెళ్లే మార్గంలో స్వర్ణముఖి నదిలో ఏర్పడిన తెగుళ్లను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించడంతో పాటు దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెంట వచ్చిన అధికారులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్తు తదితర పౌరసౌకర్యాల పునరుద్ధరణతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం గణనపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.8364 మందిని 92 సహాయ శిబిరాలకు తరలించామని, 25 కిలోల బియ్యంతో సహా 60 వేల మందికి పైగా కిరాణా సామాగ్రిని సరఫరా చేశామన్నారు. వరదనీరు వచ్చిన ప్రతి ఇంటికి రూ.లక్ష ఇస్తామని బాధితులకు తెలిపారు. తదుపరి నాలుగు లేదా ఐదు రోజుల్లో ఒక్కొక్కరికి 2500, మరియు వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. తుపానులో పంట నష్టపోయిన రైతులకు వారం రోజుల్లో 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేస్తామని, సగం ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని, వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని సీఎం జగన్ చెప్పారు.