Telangana Assembly: వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు.. మేడిగడ్డపై మాటల యుద్ధం!

Telangana Assembly Budget Sessions Twelveth day: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ చివరి రోజు కావడంతో ప్రతిపక్షాలు వాయిదా తీర్మాలు అందజేశాయి. మరోవైపు నేటితో సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పలు బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. కాగా, ఇప్పటికే శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిచండంతో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించడంతో పాటు పీఆర్సీ అమలు చేయాలని వాయిదా తీర్మానం అందించింది.
తెలంగాణ శాసనసభలో కాగ్ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టాడు. తర్వాత బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అసెంబ్లీలో మాట్లాడారు. సిర్పూర్ పేపర్ మిల్లుకు ఏడేళ్లుగా యూనియన్ ఎన్నికలను నిర్వహించడం లేదన్నారు. యాజమాన్యంతో కొంతమంది అధికారులు కుమ్మకై ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారన్నారు.
మరోవైపు, రైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. అనంతరం ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. మేడిగడ్డ విషయంలో అసెంబ్లీ వేదికగా మాటలయుద్ధం జరుగుతోంది. తమ్మిడిహట్టి దగ్గర సరిపడా నీల్లు లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ చెప్పిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.