KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. నిజమని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా

BRS MLA KTR Sensational Comments about CM Revanth In Telangana Assembly: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. సిరిసిల్ల లేదా కొడంగల్ వెళ్తామా? అని, ఒక్క గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల్లోంచి వెళ్లిపోతానని అన్నారు.
తెలంగాణకు అప్పు పుట్టడం లేదని బయట చెబుతున్నారని, కానీ రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేశామని అసెంబ్లీ మాట్లాడుతున్నారన్నారు. కొత్త టెండర్లకు డబ్బులు ఉన్నాయని, కానీ ఆరు గ్యారంటీలు అమలు చేయడానిక డబ్బు లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రైతు బంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని గుర్తు చేశారు. ప్రజలు వీళ్లను గోల్డ్ అనుకున్నారు.. కానీ వీళ్లు రోల్డ్ గోల్డ్ అని ఎద్దేవా చేశారు. అప్పులపై ప్రభుత్వం చెబుతోంది నిజమా? కాగ్ చెబుతోంది నిజమా? అని అడిగారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ స్వాతంత్య్ర ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా? అని అడిగారు. రేవంత్ రెడ్డి ఇంటిపై డ్రోన్ ఎగరేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. లేని సంబంధాలు అంటగట్టినప్పుడు మాకు బాధ ఉండదా? సీఎం రేవంత్ ఏం అనుకున్నా.. చేసేది ఏమీ ఉండదని, సీఎంకు అపరిమితమైన అధికారులు ఏమీ ఉండవన్నారు.