Last Updated:

Nara Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన నారా లోకేష్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాని నారా లోకేష్ కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ అమిత్ షాకు వివరించారు.

Nara Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని  కలిసిన నారా లోకేష్

Nara Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని నారా లోకేష్ కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ అమిత్ షాకు వివరించారు.

చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన అమిత్ షా..(Amit Shah)

చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? తనపై ఎన్ని కేసులు పెట్టారని లోకేష్ ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నానని లోకేష్ తో అమిత్ షా అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను‌ సీఐడీ రెండో రోజు విచారించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రెండో రోజు 6 గంటల పాటు నారా లోకేశ్ ‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. నిన్న అడిగిన ప్రశ్నలే అటు తిప్పి ఇటు తిప్పి అడిగారని నారా లోకేశ్ తెలిపారు. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారన్నారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్‌లకు సంబంధించి డాక్యుమెంట్‌ను తన ముందు పెట్టారన్నారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్‌లు మీ వద్దకు ఎలా వచ్చాయని అధికారులను అడిగినట్లు వెల్లడించారు. తన ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేదన్నారు.