Rahul Gandhi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన .. రాహుల్ గాంధీ
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్, కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.పార్టీ విజయ భేరి యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా కాటారం ర్యాలీలో ఆయన మాట్లాడారు.
Rahul Gandhi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్, కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.పార్టీ విజయ భేరి యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా కాటారం ర్యాలీలో ఆయన మాట్లాడారు.
దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంత మంది అధికారులుగా నియమితులయ్యారని పార్లమెంట్‌లో అడిగినప్పుడు కేవలం 5 శాతంమంది మాత్రమే ఉన్నారని తెలిసింది. దేశాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి.. అందుకే కుల గణన అవసరం. ఈ జనాభా గణన దేశానికి ఎక్స్‌రేలా పనిచేస్తుంది. కుల గణనపై మాట్లాడితే , ప్రధాని కానీ, తెలంగాణా ముఖ్యమంత్రి కానీ స్పందించరని రాహుల్ అన్నారు.లంగాణ ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్నదని, అయితే వారికి లభించింది ఒకే కుటుంబ పాలన అని రాహుల్ అన్నారు. బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీలు చేతులు కలిపి పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్ పై ఈడీ, సీబీఐ కేసులు పెట్టలేదు..(Rahul Gandhi)
కేసీఆర్ నిజంగా బీజేపీపై పోరాడుతుంటే కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ ఎందుకు కేసులు పెట్టలేదు? ఏ తప్పు చేయని తమపై 24 కేసులు పెట్టారని తెలిపారు. ఎంఐఎం పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటం లేదు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తోంది. బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఎంఐఎం అభ్యర్థులను నిలబెడుతోందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు.., కావాలనే కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. అదానీ లక్ష కోట్లు అప్పులు తీసుకుంటే.. కేంద్రం వాటిని మాఫీ చేస్తోంది.. కానీ రైతు, స్వయం ఉపాధి కూలీల రుణమాఫీ చేయడం లేదు. దేశ సంపదను అదానీకి అప్పగించారు. కుల గణన చేపట్టి దేశంలోని సంపద సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూడాలి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్నాటకలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నారో, అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను అమలు చేస్తుందని రాహుల్ స్పష్టం చేసారు.