Last Updated:

CM Jagan : చిరంజీవి, బాలకృష్ణకు సినిమా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం…

CM Jagan : చిరంజీవి, బాలకృష్ణకు సినిమా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం…

CM Jagan : రాజకీయం వేరు సినిమా వేరు అని వైసీపీ నాయకులు పదే పదే ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం మాటలకే పరిమితమా అధికారం ఉపయోగించి సినిమా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారా ? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపించక మానదు..

చిరంజీవి జనసేన కి జై కొట్టడం, బాలకృష్ణ టీడీపీ నాయకుడు కావడం వల్లే వైసీపీ వీరి సినిమా ఫంక్షన్లకి ఆంక్షలు విధిస్తోంది అంటున్నారు మెగా, నందమూరి అభిమానులు. మొదట బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొదట చిత్ర బృందం ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో ఈవెంట్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆర్గనైజర్లు. హఠాత్తుగా పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో సెట్టింగ్స్‌ మొత్తం బుధవారం రాత్రి తొలగించాల్సి వచ్చింది.

ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో అనుమతి నిరాకరించడంతో.. వీరసింహారెడ్డి టీమ్‌ రాత్రికి రాత్రే త్రోవగంట రోడ్డులో ఓ గ్రౌండ్‌ కోసం అనుమతి తెచ్చుకున్నారు. గురువారం రాత్రి వరకు ఆంక్షల పేరిట పోలీసులు ముప్పు తిప్పలు పెట్టారు. రాత్రి పది గంటల వరకూ పాసులు ఇవ్వలేదు. వాటిపై స్టాంపింగ్ వేయాలంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పుడు తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇదే తలనొప్పి వచ్చి పడింది.. విశాఖ సాగర తీరంలో భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించుకుని చకచకా పనులు పూర్తి చేసుకుంటుండగా డేట్ దగ్గరకి వచ్చేసరికి అనుమతి నిరాకరించారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చిన జీ.వో నం1 నిబంధనలకు అనుగుణంగా లేదు అని నిరాకరించడం జరిగింది. అయితే గతంలో అదే విశాఖ తీరాన భారీ ఎత్తున చాలా సినిమా ఫంక్షన్లు జరిగాయి కానీ ఎప్పుడు ఏ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. అయినప్పటికి ఇవేమి పరిగణలోకి తీసుకొని అధికారులు అనుమతి నిరాకరించడంపై మెగా అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో నుండి పలు విమర్శలు సోషల్ మీడియా నుండి వినిపిస్తున్నాయి..

ఈ నిభందనలు రాజకీయ సంబంధం ఉన్న సినీ హీరోల ఫంక్షన్లకేనా అందరు హీరోలకా ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి: