Last Updated:

Chandrababu Naidu: నువ్వు జగన్ రెడ్డి కాదు.. రివర్స్ రెడ్డివి.. చంద్రబాబు నాయుడు

ఏపీ సీఎం జగన్ సోమవారం నరసాపురం పర్యటన సందర్బంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చెట్లు నరికివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

Chandrababu Naidu: నువ్వు జగన్ రెడ్డి కాదు.. రివర్స్ రెడ్డివి.. చంద్రబాబు నాయుడు

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ సోమవారం నరసాపురం పర్యటన సందర్బంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చెట్లు నరికివేయడం పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల పర్యటన సందర్బంగా మొక్కలు నాటుతారని కాని ఇక్కడ రివర్స్ లో చెట్లు నరికేస్తున్నారని ఇది రివర్స్ పాలన అంటూ సెటైర్లు వేసారు.

సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశాం. కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? ఇదే కదా రివర్స్ పాలన అంటే నువ్వు జగన్ రెడ్డి కాదు. రివర్స్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు సెటైర్లు వేసారు.