YCP: కానిస్టేబుల్‌పై దాడి.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Police Filed Case On EX MLA Prakash Reddy: వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదైంది. జగన్ పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కారణంగా హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాట జరిగిందని, ఈ తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో పోలీసుల సూచనలు, సలహాలు పాటించలేదని పేర్కొన్నారు. అయితే జగన్ వస్తున్న సమయంలో ఆయన హెలికాప్టర్ దిగకముందే కొంతమంది కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చినట్లు చెప్పారు. అలాగే హెలికాప్టర్ వద్ద పిడిగుద్దులకు పాల్పడినట్లు ఫిర్యాదులో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ రాసుకొచ్చారు.
అయితే, హెలీప్యాడు వద్ద భద్రత సరిగా లేదని, అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు సరిగా లేవని తోపుదురతి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.అలాగే హెలీప్యాడు వద్ద డీఎస్పీతో ప్రకాశ్ రెడ్డి ఘర్షణకు దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టడంతోనే వైసీపీ కార్యకర్తలు హెలీప్యాడు వద్దకు దూసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.