Published On:

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వీఐపీ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వీఐపీ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏడుకొండల వెంకన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కొందరు కాలినడకన తిరుమలకు వస్తుండగా.. ఇంకొందరు బస్సులు, కార్లు, ట్యాక్సీల్లో కొండపైకి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక దర్శనంలోనూ వివిధ రకాలు ఉన్నాయి. సర్వదర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్యదర్శనం, వీపీఐ బ్రేక్ దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. అలాగే భక్తులకు వసతి, భోజన, దర్శన ఏర్పాట్లు చేస్తోంది. దీంతో తిరుమలకు వచ్చే సంతృప్తితో వెళ్లాలని టీటీడీ ప్రయత్నిస్తోంది.

 

అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాలను తగ్గించింది. అలాగే విఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ ఉన్న వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు అమలు చేస్తోంది.

 

ఈనేపథ్యంలోనే భక్తుల సౌకర్యార్థం వీఐపీ లేఖలను పునరుద్దరిస్తున్నట్టు టీటీడీ ఇవాళ ప్రకటించింది. రేపటి నుంచి ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. అందుకు గాను తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రిఫరెన్స్ లెటర్లను టీటీడీ స్వీకరిస్తుంది.