Home / TTD
Former TTD EO Subramanayam: టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లో దర్శనం కల్పించడం అనేది చాలా కష్టమేననని వెల్లడించారు. ఏఐ దర్శనం ఆలోచన విరమించుకోవాలన్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్ర దర్శనం కష్టమని, అమలు సాధ్యంకాని ఆలోచనకు టీటీడీ స్వస్తి పలకాలని చెప్పారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాగా, ఏఐతో భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు […]
TTD: జనాలకు రీల్స్ పిచ్చి పెరిగిపోయింది.. ప్రాంతాలు, ప్రదేశాలతో సంబంధం లేకుండా రీల్స్ చేస్తూ రూల్స్‌ను అతిక్రమిస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో కొంతమంది డ్యాన్స్‌లతో సోషల్ మీడియా రీల్స్ చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని విజిలెన్స్ సిబ్బంది హెచ్చరించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని టీటీడీ […]
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్‌లతో సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని టీటీడీ పేర్కొంది. పవిత్రమైన క్షేత్రంలో అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని తెలిపిందతి. కేవలం ఆధ్యాత్మిక […]
TTD Key decision on Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల డిమాండ్ నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కోటాను 2,000 లకు పెంచింది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా కింద తిరుమలలో […]
Breaking News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 68 వేల, 838 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో 4.49 కోట్ల రూపాయలు సమర్పించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల శ్రీవారి దర్శనానికి సుమారు 5గంటల సమయం పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18గంటల సమయం […]
TTD: ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. దాదాపు 45 అంశాలతో రూపొందించిన అజెండాపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను, విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడం, తిరుమలలోని పాత భవనాలను నూతన డోనార్ స్కీం కింద పునర్నిర్మించే అంశం, వేదపారాయణదారులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేసే […]
Huge Devotees Rush At Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి అన్నికంపార్ట్ మెంట్లు నిండి బయట నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 14గంటల సమయం పడుతుంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ. 300ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా.. సోమవారం 20వ తేదీన […]
TTD issuing free Religious Books for Srivari Devotees: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు కోసం మరో ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంచేలా ఉచితంగా శ్రీవారి పుస్తకాల పంపిణీ చేయనుంది. అతి త్వరలోనే ఈ ఏర్పాట్లు పూర్తికానున్నాయి. తిరుమల వచ్చే భక్తులు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఉచితంగా ఆధ్యాత్మిక పుస్తకాలను ఇవ్వాలని ఆలోచన చేసింది. ఇందులో భాగంగా పంపిణీ చేయనున్న పుస్తకాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు […]
TTD: తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తున్న రోబ్లాక్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్.. వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకునే దృశ్యాలతో రోబ్లాక్స్ యాప్‌ను రూపొందించినట్లు ఫిర్యాదులు అందాయని […]
September Month Darshanam tickets Release Today: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వివిధ రకాల సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. కాగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు […]