Last Updated:

Nara Chandrababu : ఫైబర్‌నెట్‌ కేసులోచంద్రబాబుకు ఊరట..అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ

ఫైబర్‌నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. చంద్రబాబుపై నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో దాఖలు

Nara Chandrababu : ఫైబర్‌నెట్‌ కేసులోచంద్రబాబుకు ఊరట..అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ

Nara Chandrababu : ఫైబర్‌నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. చంద్రబాబుపై నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ తీర్పుకు ముడిపడి ఉన్నాయని సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు వివరించారు.. దీనిని పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్‌ 9కి వాయిదా వేసింది.

అప్పటి వరకు పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఫైబర్‌నెట్‌ కేసులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సీఐడీ తరఫు లాయర్ కోర్టులో వాదించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి మాత్రం వీల్లేదని సీఐడీ, ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా సుప్రీం నిర్ణయంతో చంద్రబాబుకు స్వల్ప ఊరట దక్కినట్లయ్యింది.

మరోవైపు చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సరైన లీగల్ ఫార్మాట్‌లో రావాలని న్యాయమూర్తి సూచించారు. రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌కు అనుమతించింది. మరోవైపు చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటాను భద్రపరచాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని ఆదేశించింది. ఈ నెల 26 వరకు సమయం కావాలని సీఐడీ పీపీ న్యాయస్థానాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ 26కి వాయిదా వేసింది.