Last Updated:

AP High Court: ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతర హింసపై వివరణ కోరిన హైకోర్టు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ హింసపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది.

AP High Court: ఏపీలో ఎన్నికల  ఫలితాల అనంతర  హింసపై వివరణ కోరిన హైకోర్టు

AP High Court: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ హింసపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులకు సంబంధించిన పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని హైకోర్టు కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి.. జస్టిస్ న్యాపతి విజయ్ లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాల్ని జారీ చేసింది.

హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వైవీ సుబ్బారెడ్డి..(AP High Court)

ఫలితాల అనంతరం ఒక రాజకీయ పార్టీకి చెందిన వారిని టార్గెట్ చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బాధితుల్ని రక్షించేందుకు అవసరమైన చర్యల్ని సత్వరమే చేపట్టాలని కోరుతూ తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తమపై జరుగుతున్న దాడులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు ఇస్తున్నా వాటిని తీసుకోవటం లేదని.. పోలీసులు కేసులు నమోదు చేయటంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. హింసకు సంబంధించిన కంప్లైంట్లు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరినట్లుగా పేర్కొన్నారు. అల్లర్లు.. ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న నిందితులపై హైకోర్టు ఏ ాదేశాలు ఇచ్చినా అవి దేశం మొత్తానికి మార్గదర్శకాలుగా మారతాయన్నారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసకు సంబంధించిన వారిని గుర్తించి.. వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం సిట్ ఏర్పాటు చేసి.. బాధితులకు .. వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. హింసకు దారి తీసిన పరిస్థితులను తెల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ తన వాదనల్ని వినిపిస్తూ.. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఇప్పటివరకు సాగుతున్న హింసకు సంబంధించిన కొన్ని వీడియోలు.. పేపర్ సాక్ష్యాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అతేకాదు.. ఇళ్లు.. ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: