Last Updated:

Fire Accident : బాపట్ల ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం .. 400 కోట్ల నష్టం

బాపట్ల జిల్లా ఇంకొల్లు సమీపంలో గల ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండుగ నేపధ్యంలో పెద్ద మొత్తంలో వస్తారు తయారు చేసేందుకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ విషాద ఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఒక వైపు కార్మికులు పని చేస్తుండగానే ఊహించని రీతిలో

Fire Accident : బాపట్ల ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం .. 400 కోట్ల నష్టం

Fire Accident : బాపట్ల జిల్లా ఇంకొల్లు సమీపంలో గల ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండుగ నేపధ్యంలో పెద్ద మొత్తంలో వస్తారు తయారు చేసేందుకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ విషాద ఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఒక వైపు కార్మికులు పని చేస్తుండగానే ఊహించని రీతిలో చెలరేగిన మంటలు అంతటా వ్యాపించి పరిశ్రమ మొత్తాన్ని చుట్టుముట్టాయి. దాంతో వస్త్ర తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో పాటు ఫ్యాక్టరీ లోని మిషనరీ కూడా మంటల్లో కాలిపోయింది. ఇంత భారీ మొత్తలో నష్టం జరగడంతో విషయం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకొల్లు సమీపంలో గల ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమలో దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దసరా సీజన్ కావడంతో భారీగా వస్త్రాల తయారీ చేపట్టేందుకు వందల కోట్లతో ముడిసరుకును సిద్దం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున కార్మికులంతా తమ పనుల్లో మునిగివుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది పసిగట్టిన కార్మికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పటికే తయారుచేసిన వస్త్రాలతో పాటు మూడువేల టన్నుల దారం కాలిబూడిదయ్యింది. అలాగే పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించి వస్త్రాల తయారీకి ఉపయోగించే యంత్రాలకు కూడా వ్యాపించాయి.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే వస్త్రాలు, దారం బిండలకు మంటలు అంటుకున్నాయి. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి ఫైరింజన్లతో మధ్యాహ్నం 12గంటల వరకు సిబ్బంది కష్టపడ్డారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికి.. దాదాపు రూ.400 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం చెబుతోంది.