Last Updated:

Chandrababu Naidu: హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నాయుడు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు అమెరికా వెళ్లి దాదాపు పది రోజుల పాటు అక్కడే ఉన్నారు.

Chandrababu Naidu: హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు అమెరికా వెళ్లి దాదాపు పది రోజుల పాటు అక్కడే ఉన్నారు.

ఘనంగా స్వాగతం..(Chandrababu Naidu)

చంద్రబాబు హైదరాబాద్ కు వస్తున్న సంగతి తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ‘సీఎం, సీఎం’ నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. పది రోజుల పాటు విదేశాల్లో ఉండి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..ఈరోజు హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుని రేపు ఉండవల్లి బయలుదేరి వెళతారు.

ఇవి కూడా చదవండి: