Published On:

Chandrababu : త్వరలో ఏపీ లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu : త్వరలో ఏపీ లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు

CM Chandrababu reviews ports, airports and fishing Harbors : పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, ఫిషింగ్‌ హార్బర్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదికి నాలుగు పోర్టులు, నాలుగు హార్బర్లు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో ఏపీ లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొదటి దశలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. పీపీపీ విధానంలో రద్దీ మేరకు రాష్ట్ర రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లు వివరించారు. హైవేలతో అన్ని రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయాలని ఆదేశించారు.

 

మచిలీపట్నం పోర్టు తొలిదశ పనులు 43.25 శాతం పూర్తయయ్యాయని, వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి పనులు పూర్తికానున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రామాయపట్నం పోర్టు తొలి దశ పనులు 63.89 శాతం, మూలపేట పోర్టు తొలిదశ పనులు 46.59 శాతం పూర్తికాగా, కాకినాడ గేట్‌వే పోర్టు పనులు 29.92 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తొలిదశ నిర్మాణం పనులు 97.72 శాతం పూర్తయయ్యాయని తెలిపారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ తొలిదశ పనులు 81.17 శాతం పూర్తయయ్యాయని సీఎం చంద్రబాబుకు వివరించారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ మొదటి దశ పనులు 69.20 శాతం పూర్తి కాగా, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ తొలిదశ పనులు 78.94 శాతం పూర్తయ్యాయని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు.

ఇవి కూడా చదవండి: