Published On:

Amarnath Yatra: ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

Amarnath Yatra: ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

Jammu And Kashmir: అమర్ నాథ్ యాత్ర కాశ్మీర్ లోయలోని బేస్ క్యాంపుల నుంచి గురువారం ప్రారంభమైంది. గందర్ బాల్ జిల్లాలోని బాల్టాల్, పహల్గాంలోని నున్వాన్ క్యాంపుల నుంచి రెండు బ్యాచ్ ల యాత్రికుల ప్రయాణాన్ని అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. మొన్న 5892 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ ను జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద ఎల్జీ మనోజ్ సిన్హా జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.

ఆ బ్యాచ్ నున్వాన్ బేస్ కు చేరుకోగానే అధికారులు స్వాగతం పలికారు. 5200 మందికి పైగా యాత్రికులతో కూడిన రెండో బ్యాచ్ బాల్టాల్ బేస్ నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు బయల్దేరిన యాత్రికుల సంఖ్య 11,138కి చేరింది. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, పారామిలిటరీ దళాల నుంచి వేలాది మంది సిబ్బందిని మొహరించారు. 38 రోజులపాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 9న ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి: