Published On:

CM Chandrababu: సీఎం చంద్రబాబు ‘సుపరిపాలనలో తొలి అడుగు’.. షెడ్యూల్ ఇదే!

CM Chandrababu: సీఎం చంద్రబాబు ‘సుపరిపాలనలో తొలి అడుగు’.. షెడ్యూల్ ఇదే!

CM Chandrababu Visiting Kuppam Today: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ది కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటి ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

 

ఇందులో భాగంగానే మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం తిమ్మరాజుపల్లెలో ఇంటింటా ప్రజలతో మాటామంతీ కార్యక్రమంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి రాత్రి శివపురంలోని ముఖ్యమంత్రి నివాసంలో బస చేయనున్నారు. అలాగే రేపు ఉదయం 10:30 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎన్సీ నెర్వ్ సెంటర్‌ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం నివాసంలో అధికారిక సమీక్షలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి: