Published On:

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం

CM Chandrababu Naidu launch Matsyakara Sevalo program in srikakulam: రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. మత్స్యకారులను ఆదుకునేందుకు ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో మత్స్యకారుల భరోసా పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కాగా, ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట బ్రేక్‌కు సంబంధించి ఒక్కో కుటుంబానికి భృతి కింద రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు పెంచారు. ఈ మేరకు రూ.259 కోట్లు జమ చేశారు.

 

మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు చూసేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టి మాట్లాడారు. 32 శాతం మత్స్యసంపద రాష్ట్రం నుంచి ఎగుమతులు నిర్వహించడంతో దాదాపు రూ.16.50లక్షల మందికి ఉపాధి పొందుతున్నట్లు వివరించారు. దీంతో మత్స్యకారుల పిల్లల విద్య ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. అయితే ఇప్పటికే 6 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, ఎచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో పేద ప్రజలకు రూ.33వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని చంద్రబాబు అన్నారు.

 

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జాలర్ల దశదిశ మారిందని చంద్రబాబు అన్నారు. అంతకుముందు స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశాననన్నారు. రాత్రి సమయాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తున్నారని చెప్పారు. అయితే కొంతమంది బోట్ల ద్వారా జాలర్ల సగం ఆదాయం కాజేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాకే జాలర్ల జీవితాలు మారాయని వెల్లడించారు. మత్స్యకార గ్రామాలు ఒకే మాటపై ఉండి కట్టడిగా ఉంటారని చెప్పారు.