Published On:

Global Medcity in Amaravati: రాజధాని అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ: సీఎం చంద్రబాబు నాయుడు

Global Medcity in Amaravati: రాజధాని అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ: సీఎం చంద్రబాబు నాయుడు

AP CM Chandrababu’s plan for global Medcity in Capital Amaravati: రాజధాని అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట ముఖ్యమంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై చంద్రబాబు వివరాలు తెలిపారు.

 

కుప్పంలో డిజిటల్‌ హెల్త్‌ నర్వ్‌ సెంటర్‌..
కుప్పంలో డిజిటల్‌ హెల్త్‌ నర్వ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. కొన్నిచోట్ల గుండెజబ్బులు, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్‌టెన్షన్‌ అధికంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్‌ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం వివరించారు.

 

ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గించాలి..
వ్యాధుల నివారణకు మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని స్పష్టం చేశారు. నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములనే తీసుకోవాలని సూచించారు. వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్లు మాత్రమే వినియోగించాలన్నారు. చక్కెర రోజుకు 25 గ్రాముల చొప్పున నెలకు 3 కిలోలు వాడితే సరిపోతుందని వివరించారు. ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రణ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉండదు.

 

రోజుకు అరగంట వ్యాయామం చేయాలి..
రోజుకు అరగంట పాటు వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రాణాయామం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తోందని చెప్పారు. ఇటీవల న్యూట్రిఫుల్ అనే యాప్ తయారు చేశామని తెలిపారు. దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చిందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాప్ అన్నారు. దీన్ని ఇప్పటి వరకు 4 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి: