Published On:

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులు

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులు

AP Government changes in Grama and Ward Sachivalayams: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

అంతేకాకుండా, 2,500 అంతకంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు సిబ్బంది కేటాయించింది. దీంతో పాటు 2,501 నుంచి 3,500 మధ్యలో జనాభా ఉన్న సచివాలయానికి ముగ్గురు సిబ్బంది.. 3,501 నుంచి అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయానికి నలుగురు సిబ్బందిని కేటాయించింది. రియల్ టైమ్‌లో పౌరసేవలు అందించేలా సిబ్బందికి విధులు అప్పగించింది.