Published On:

AP & TG Weather Report: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

AP & TG Weather Report: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

Telangana and Andhra Pradesh States Weather Reports: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. తెలంగాణతో పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, యానాం ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు సాయంత్రం ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉందని, ఈదురుగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

 

ఇక, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడనున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు సైతం 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.