Published On:

AP Rajya Sabha Seat: విజయసాయిరెడ్డి రాజీనామా.. ఏపీ రాజ్యసభ స్థానం ఎన్నికకు నోటిఫికేషన్‌!

AP Rajya Sabha Seat: విజయసాయిరెడ్డి రాజీనామా.. ఏపీ రాజ్యసభ స్థానం ఎన్నికకు నోటిఫికేషన్‌!

Election Notification for Ap Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీనికి భర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ని విడుదల చేసింది.

 

త్వరలోనే ఈ నెల 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఇచ్చింది. ఏప్రిల్‌ 30న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. మే 2 వరకు ఉపసంహరణ గడువు, మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశారు.

 

 

ఇవి కూడా చదవండి: