AP Inter Results 2025: నేడే ఇంటర్ రిజల్ట్స్.. చెక్ చేసుకోండిలా..!

AP Inter Results 2025 Out Now: విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శర్మ తెలిపారు. అలాగే ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ ఆధారంగా సులువుగా తెలుసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్ ద్వారా మరింత సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. వాట్సప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా, ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్, సెకండియర్ కలిపి 10,17,102 మంది విద్యార్థులు హాజరయ్యారు.