Published On:

Gorantla Madhav Arrest: చేబ్రోలు కిరణ్‌పై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్

Gorantla Madhav Arrest: చేబ్రోలు కిరణ్‌పై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్

Gorantla Madhav Arrested: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్‌పై మాధవ్ దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

కాగా, వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలిస్తున్నారు. అయితే మంగళగిరి నుంచి గుంటూరు వరకు పోలీసుల వాహనాన్ని మాధవ్ ఫాలో కావడంతో పాటు వెంబడించాడు. అంతేకాకుండా పోలీసుల వాహనాన్ని అడ్డగించి వార్నింగ్ ఇచ్చాడు. కిరణ్ నీ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు విధులకు ఆటంకం కలిగింది. ఇందులో భాగంగానే మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.