Millets For Weight Loss: తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గాలా ? ఇలా చేస్తే.. బెస్ట్ రిజల్ట్

Millets For Weight Loss: బరువు తగ్గడం కోసం చాలా మంది గోధుమ పిండితో తయారు చేసిన రోటీలను తింటూ ఉంటారు. కానీ గోధుమల కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమైన ధాన్యాలు చాలా ఉన్నాయి. బరువు తగ్గడానికి గోధుమలకు బదులుగా మిల్లెట్స్ తినడం శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
మిల్లెట్స్ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే చిరు ధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఇవి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, స్వీట్లు , జంక్ ఫుడ్స్ తినాలనే కోరికను కూడా నియంత్రిస్తాయి. కానీ బరువు తగ్గడానికి ఎలాంటి మిల్లెట్స్ తినాలో తెలియక ప్రజలు అయోమయంలో పడుతుంటారు. అందుకే ఏ మిల్లెట్స్ బరువు తగ్గడంలో ఉపయోగపడతాయో తెలుసుకుందామా..
సజ్జలు:
వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మీరు వీటిని మీ బరువు తగ్గించడంలో కూడా ఉపయోగించుకోవచ్చు.తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. చిరుధాన్యాలతో రోటీ, గంజి, కిచిడి తయారు చేసుకుని కూడా తినవచ్చు. టైప్ 2 డయాబెటిస్తో పాటు.. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి.
రాజ్గిరా గింజలు:
చాలా మంది ఉపవాస సమయంలో ఈ మిల్లెట్‌ను తింటారు. రాజ్గిరాలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చిరు ధాన్యంతో మీరు కిచిడి, లడ్డు, ఇతర ఆహారాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిల్లెట్ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అంతే కాకుండా వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీరు వీటిని తినడం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
రాగులు:
చాలా మంది రాగులతో దోస, రోటీ వంటివి తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇది ప్రోటీన్, కాల్షియం, అనేక ఇతర సూక్ష్మపోషకాలకు మంచి మూలం. దీంతో పాటు, మధుమేహం ఉన్నవారికి రాగులు కూడా ఒక గొప్ప ఎంపిక. బరువు తగ్గడంతో పాటు, ఎముకలను కూడా ఇది బలపరుస్తుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు పిల్లల మానసిక అభివృద్ధికి సహాయపడతాయి.
జొన్నలు:
జొన్నల్లో విటమిన్ బి, కాల్షియం, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు , మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. జొన్నలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఈ మిల్లెట్ తినడం వల్ల శరీరంలోని కొవ్వు ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.
ఫాక్స్‌టైల్ మిల్లెట్:
ఇది షుగర్ పేషెంట్లకు ఉత్తమమైన మిల్లెట్. దీనిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక సూక్ష్మపోషకాలు వీటిలో లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయపడతాయి. తరచుగా వీటిని తినడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.