Published On:

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ టైటిల్ లో అంత అర్థముందా! – అదేంటో తెలుసా?

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ టైటిల్ లో అంత అర్థముందా! – అదేంటో తెలుసా?

AM Ratnam Revealed Hari Hara Veeramallu Title Meaning: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ హరి హర వీరమల్లు. ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇవాళ(మే 21) ఈ చిత్రం నుంచి మూడో పాటను రిలీజ్‌ చేశారు. ‘అసుర హననం’ అంటూ సాగే ఈ పాటను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ పాట రిలీజ్‌ సందర్భంగా మూవీ టీం గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ని నిర్వహించింది.

 

ఈ కార్యక్రమానికి హీరోయిన్‌ నిధి అగర్వాల్‌తో పాటు దర్శక నిర్మాతలు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎమ్‌ఎమ్‌ కీరవాణితో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని డైరెక్ట్‌ చేయడమే తనకు పెద్ద అవార్డు అన్నారు. “ఈ సినిమాను, వీరమల్లు పాత్ర డిజైన్‌ చేసింది డైరెక్టర్‌ క్రిష్‌ గారు. ఈ క్రెడిట్‌ అంత ఆయనకే ఇవ్వాలి. పెద్ద స్ట్రాంగ్‌ ఫౌండేషన్‌ వేసి పెద్దలతో ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. అలాంటి ఆయన ఒలంపిక్‌ టార్చ్‌లాగా ఈ ప్రాజెక్ట్‌ని నాకు ఇచ్చారు.

 

నేను ఈ ప్రాజెక్ట్‌ చేపట్టి ముందుకు తీసుకువెళ్లాను. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయడమనేది చిన్న విషయం కాదు. ముందుగా ఆయనను ఇంప్రెస్‌ చేయాలి. ఈ సినిమా అవుట్‌పుట్‌ చూసి ఆయన ఇంప్రెస్‌ అయ్యారు. వీరమల్లు అవుట్‌ పుట్‌ పవన్‌ గారికి, నిర్మాత ఏఎమ్‌ రత్నం గారు ఇద్దరు ఇంప్రెస్‌ అయ్యారు. ‘అసుర హననం’ ఈ సాంగ్‌ టైటిల్‌ని కీరవాణి గారు పెట్టారు. ఇది ఫైట్‌ సాంగ్‌. దీనిని పవన్‌ కళ్యాణ్‌ గారే డిజైన్‌ చేసి కంపోజ్‌ చేశారు. ఈ ఒక్క పాటనే దాదాపు 60 రోజులు షూట్‌ చేశాం. ఈ సినిమాలో సీజీ వర్క్‌కి పెద్దపీట వేశాం. ఇందులో అత్యాధునిక సాంకేతికను ఉపయోగించాం.

 

ఇది హయ్యేస్ట్‌ స్టాండర్డ్స్‌ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీజే వర్క్‌ నిపుణులు వర్క్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగానికి ‘హరి హర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’. ఈ టైటిల్‌కు అర్థం స్వార్డ్‌ అంటే ఖడ్గం, స్పిరిట్‌ అంటే ధర్మం. ఇక్కడ ఖడ్గం అంటే బాబి డియోల్‌. ధర్మం అంటే పవర్‌ కళ్యాణ్‌. ఒక కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ హరి హర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ ఆసక్తిని సంతరించుకున్నాయి. కాగా నీ మనసు నాకు తెలుసు చిత్రం తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది.

ఇవి కూడా చదవండి: