WhatsApp: అదిరిపోయే ఫీచర్.. ఒకే నెంబర్‌తో రెండు వాట్సాప్‌లు
ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.
WhatsApp: ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.
ఇదివరకు ఒక నెంబర్ తో ఒక వాట్సాప్ ను మాత్రమే వాడగలిగే వాళ్లం కానీ ఒకే నంబర్ ఒకేసారి రెండు అంతకంటే ఎక్కువ డివైజ్లలో వాట్సాప్ ఉంటే ఎలా ఉంటుందంటారు. ఈ ఐడియాతో వాట్లాప్ కొత్త అప్డేట్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లతోపాటు.. మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్ చేసుకోవడానికి యూజర్లకు అనుమతినివ్వనుంది. ఈ సేవను ఎనేబుల్ చేసేలా ‘కంపానియన్ మోడ్ (companion mode)’ అనే ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.
అంతేకాకుండా మొబైల్, డెస్క్‌టాప్‌లో ఏకకాలంలో వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చట. ‘లింక్ డివైస్’ ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లింక్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందిస్తుంది. మరొక స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసిన తర్వాత, చాట్ హిస్టరీ చూడటం తోపాటు, మెసేజేస్ చూసుకోవడం, సమాధానాలివ‍్వడంతోపాటు కాల్స్‌ను చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. బీటా టెస్టర్ గరిష్టంగా 4 పరికరాలను రెండు స్మార్ట్‌ఫోన్‌లు, ఒక టాబ్లెట్ , ఒక డెస్క్‌టాప్‌కి లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సాప్ సేవలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా వాట్సాప్‌కు భారతదేశంలో దాదాపు 500 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.
ఇదీ చదవండి: అమెజాన్ లో 10000 ఉద్యోగాలు కోత..!