WhatsApp New Features: ఆహా.. అదిరిపోయిన వాట్సాప్ కొత్త ఫీచర్లు.. వీడియో కాల్స్‌లో న్యూ ఎఫెక్ట్స్..!

WhatsApp New Features: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనితో చాటింగ్ నుండి వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ వరకు ప్రతిదాన్ని విసృతంగా ఉపయోగించొచ్చు. నేడు వాట్సాప్ రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. సుమారు 3.5 బిలియన్ల మంది ప్రజలు దీనిని తమ ఫోన్‌లలో ఉపయోగిస్తున్నారు. వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి కంపెనీ కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. మరోవైపు వాట్సాప్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ 2025 మొదటి 3 నెలల్లో అనేక ఫీచర్లను ప్రారంభించింది. మరోవైపు, రాబోయే నెలల్లో త్వరలో విడుదల కానున్న అనేక ఫీచర్లపై ఇది పనిచేస్తోంది. ఇదిలా ఉంటే, వాట్సాప్ కాలింగ్,వీడియో కాలింగ్ కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు వాట్సాప్‌లో వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేస్తే, ఇప్పుడు మీరు కొత్త అనుభూతిని పొందుతారు.
వాట్సాప్ ఈ రాబోయే ఫీచర్ గురించి సమాచారాన్ని ప్రముఖ వెబ్‌సైట్ WABetainfo షేర్ చేసింది. ఈ ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న Android 2.25.10.16 అప్‌డేట్ కోసం కొత్త WhatsApp బీటాలో గుర్తించారు. వాట్సాప్ వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ కోసం మూడు కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నట్లు ఇది చూపిస్తుంది. ప్రస్తుతం, కంపెనీ బీటా వినియోగదారుల కోసం ఈ ఫీచర్లను విడుదల చేసింది.
వాట్సాప్ ఈ రాబోయే ఫీచర్ల స్క్రీన్‌షాట్‌లు కూడా WABetainfo ద్వారా వెల్లడయ్యాయి. వాట్సాప్ వినియోగదారులు పొందే మొదటి ఫీచర్ మ్యూట్ బటన్, ఇది ఇన్‌కమింగ్ వాయిస్ కాల్ నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ ఈ ఫీచర్ మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయడం ద్వారా కాల్‌లను తీయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
వాట్సాప్ వినియోగదారులు వీడియో కాలింగ్ సమయంలో కొత్త ఫీచర్‌ను పొందబోతున్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు వీడియో కాల్‌ని అటెంప్ట్ చేయడానికి ముందు వీడియోను ఆఫ్ చేసే సౌకర్యం అందించనుంది. ఇంతకుముందు, వినియోగదారులు కాల్ తీసుకున్న తర్వాత కెమెరాను ఆఫ్ చేయాల్సి వచ్చింది, ఇది కొంత అసౌకర్యంగా ఉంది, కానీ ఇప్పుడు వినియోగదారులు కాల్ తీయడానికి ముందే వీడియోను ఆఫ్ చేయగలరు. వాట్సాప్ త్వరలో వినియోగదారులకు వీడియో కాల్స్‌లో ఎమోజీ రియాక్షన్‌ల సౌకర్యాన్ని అందించబోతోంది. ఇది వీడియో కాల్‌ల సమయంలో వినియోగదారులు రియల్ టైమ్‌లో స్పందించడానికి అనుమతించే ఫీచర్.
ఇవి కూడా చదవండి:
- BSNL: గుక్క తిప్పుకోనివ్వని BSNL.. కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు.. జియో, ఎయిర్‌టెల్‌లకు షాకులే షాకులు..!