Supreme Court: మాజీ ఎంపీ నందిగామ సురేష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరణ!
Supreme Court Shocks To Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగామ సురేష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహిళా హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. మరియమ్మ హత్య కేసులో బెయిల్‌పై సుప్రీంకోర్టు ఎటు తేల్చలేదు. ఛార్జిషీటు ఫైల్ అయిన తర్వాత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.
ఇందులో ప్రధానంగా మూడు అంశాలను పేర్కొనలేదు. ఈ కేసులో ఇంకా ఛార్జీషీటు దాఖలు చేయలేదు. ఆయన అరెస్ట్ అయి 90 రోజులు కానందున ఛార్జీషీటు దాఖలు చేయలేదు. ఈ దశలో బెయిల్ విషయంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో గతంలో ఆయనపై నమోదైన కేసుల వివరాలను బెయిల్ పిటిషన్‌లో నమోదు చేయకపోవడంపై ధర్మాసనం తప్పుబట్టింది.