Last Updated:

Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో వరుస పేలుళ్లు.. ఉగ్రమూకల వ్యూహమేనా..?

జమ్ముకశ్మీర్‌లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్‌లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో వరుస పేలుళ్లు.. ఉగ్రమూకల వ్యూహమేనా..?

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్‌లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో బుధవారం రాత్రి ఆగి ఉన్న బస్సులో పేలుడు జరిగింది. కాగా గంటల వ్యవధిలోనే మరోచోట పేలుడు చోటుచేసుకున్నది. గురువారం ఉదయం ఉధంపూర్‌లోని పాతబస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా పేలుడు సంభవించి బస్సు ధ్వంసం అయ్యింది కాగా ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా బుధవారం రాత్రి 10.45 సమయంలో ఉధంపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొమాలి చౌక్‌ వద్ద ఓ బస్సులో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. అయితే ఈ రెండు పేలుళ్లపై పోలీసులు, భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గంటల వ్యవధిలోనే ఈ సంఘటనలకు జరుగడం వెనుక ఉగ్రమూకల వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఐఏఎస్ అధికారులను పంపండి ప్లీజ్.. రాష్ట్రాలకు కేంద్రం విన్నపం

ఇవి కూడా చదవండి: