Last Updated:

IAS: ఐఏఎస్ అధికారులను పంపండి ప్లీజ్.. రాష్ట్రాలకు కేంద్రం విన్నపం

చాలా మంది ఐఏఎస్ అధికారులు దేశ రాజధానిలో తమ సేవలందించడానికి ఇష్టపడతారు. కానీ ఇటీవలె కాలంలో రాజకీయ నేతల ఒత్తిడి మరియు అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కారణంగా వారు ఆవైపు కూడా చూడాలనుకోవడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవిస్తోంది.

IAS: ఐఏఎస్ అధికారులను పంపండి ప్లీజ్.. రాష్ట్రాలకు కేంద్రం విన్నపం

IAS: చాలా మంది ఐఏఎస్ అధికారులు దేశ రాజధానిలో తమ సేవలందించడానికి ఇష్టపడతారు. కానీ ఇటీవలె కాలంలో రాజకీయ నేతల ఒత్తిడి మరియు అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కారణంగా వారు ఆవైపు కూడా చూడాలనుకోవడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవిస్తోంది.

కేంద్ర సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే ఏఐఎస్‌ అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఆవైపు కూడా చూడటం లేదంట. దానితో ఐఏఎస్ ఐపీఎస్ ల కొరత ఏర్పడింది. దేశరాజధాని ఢిల్లీలో సరిపడినంత మంది అధికార యంత్రాంగం ఉండడం లేదని.. డిప్యూటేషన్‌పై రాష్ట్రాల్లో సేవలందిస్తున్న అధికారులను ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతుంది. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్స్‌/యూటీస్‌ కాన్ఫరెన్స్‌ ఇటీవల కాలంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్ అధికారుల డిప్యూటేషన్లపై చొరవ తీసుకోవాలని విన్నవించారు. గత ఐదేళ్ల కాలంలో 563 మందికి డిప్యూటేషన్‌ అవకాశం వచ్చినా, 397 మందే ఆసక్తి చూపారని నివేదికలు తెలుపుతున్నాయి.

కేంద్రంలో సేవలందించడానికి డిప్యూటేషన్‌పై వెళ్లే ఏఐఎస్‌ అధికారుల సంఖ్య బాగా తగ్గడం వల్ల సర్వీస్‌ నిబంధనల్లో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి అంగీకారం మేరకు మాత్రమే ఏ అధికారిని అయినా డిప్యూటేషన్‌పై పంపేవారు. కాగా ఇప్పుడు కొత్త ప్రతిపాదన వస్తే రాష్ట్రాల అంగీకారంతో సంబంధం లేకుండా కేంద్రం ఎవరిని కావాలంటే వారిని కేంద్రంలో ఉద్యోగానికి పంపాల్సివస్తుంది. దీనికి సంబంధించి జీవో పాస్ చెయ్యడానికి మోదీ సర్కార్ యత్నిస్తుండగా దానిని బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టికెట్లు

ఇవి కూడా చదవండి: