Last Updated:

Jamshed J Irani: స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఇకలేరు

స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్‌ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్‌ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్‌ హాస్పిటల్‌లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

Jamshed J Irani: స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఇకలేరు

jamshed j irani: స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్‌ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్‌ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్‌ హాస్పిటల్‌లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జంషెడ్ మరణంపై టాటా స్టీల్‌ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేసింది. ఇరానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ట్వీట్‌ చేసింది. పలువురు ప్రముఖులు కూడా ఇరానీ మృతిపై సంతాపం తెలిపారు. జార్ఖండ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా సంతాపం ప్రకటించారు. సమర్థుడైన గొప్ప నాయకుడిగా ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారన్నారు.

నాలుగు దశాబ్దాలకుపైగా భారతీయ పరిశ్రమకు, టాటాలకు విశేషమైన సేవలందించిన జంషెడ్‌ ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు.
1963లో బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్, షెఫీల్డ్‌లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఇరానీ 1968లో టాటా స్టీల్‌లో డైరెక్టర్ (R&D)కి అసిస్టెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1992లో టాటా స్టీల్లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి జూలై 2001 వరకు ఆ పదవిలో కొనసాగారు. యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ నుంచి డాక్టరేట్ సర్టిఫికేట్ పొందారు. జంషెడ్ ఇరానీ అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

ఇదీ చదవండి ఇన్‌స్టాగ్రామ్ ఏమైంది.. ఒక్కసారిగా అకౌంట్లు డిలీట్..!

ఇవి కూడా చదవండి: