IPL 2025: నేడు కీలక మ్యాచ్.. కోల్‌కతాతో హైదరాబాద్ ఢీ

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు 15వ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. కాగా, గత సీజన్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడగా.. తాజాగా, ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. కానీ తర్వాతి రెండు మ్యాచ్‌లు వరుసగా ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది.
అయితే, ఇరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 18 సార్లు విజయం సాధించగా.. హైదరాబాద్ 9 సార్లు మాత్రమే గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పట్టు బలంగా ఉంది. నరైన్, రస్సెల్, అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే హైదరాబాద్ జట్టులో కూడా హెడ్, అభిషేక్, అనికేత్ వంటి హిట్టర్స్ ఉన్నారు.