MPs Salaries Hike: కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంపు

MPs’ Salaries Hiked To Rs 1.24 Lakh Per Month: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎంపీల వేతనం రూ.లక్ష ఉండగా.. రూ.లక్షా 24 వేలకు పెంచింది. అలాగే ఎంపీల రోజూవారీ భత్యం రూ.2 వేల నుంచి రూ.2,500, అలాగే మాజీ ఎంపీలకు పింఛన్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఎంపీలకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు రూ.25 వేల నుంచి రూ.31 వేలకు పెంచింది. కాగా, పెంచిన వేతనాలు, పింఛన్లు 2023 ఏప్రిల్ నుంచి వర్తించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
అంతేకాకుండా, ఎంపీల జీతంలో ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు. కాగా, ఒక్కో ఎంపీకి 50 వేల యూనిట్ల ఉచిత కరెంట్‌తో పాటు 1.70లక్షల ఫ్రీ కాల్స్, 40 లక్షల లీటర్ల నీరు, నివాసం ఉండేందుకు ప్రభుత్వ హోం ఉన్నాయి. అంతకుముందు, 1954 ఎంపీ జీతం, పెన్షన్ చట్టం ఆధారంగా వీటిలో కేంద్రం మార్పులు చేసింది. అయితే 2018 తర్వాత మళ్లీ ఎంపీల జీతంతో పాటు పెన్షన్ విషయంలో సవరణ చేయడం తొలిసారి.